Home / ANDHRAPRADESH / సోషల్ మీడియాలో బాబు-లోకేశ్ లపై పేలుతున్న “జోకులు”

సోషల్ మీడియాలో బాబు-లోకేశ్ లపై పేలుతున్న “జోకులు”

ఏపీ ప్రభుత్వంతో పాటు అధికార టీడీపీకి చెందిన నేతలను ,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రస్తుతం కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న అంశం డేటా చోరీ కేసు వివాదం. ఏపీలోని ప్రజల వ్యక్తిగత సమాచారంతో పాటుగా ఏ పార్టీకి మద్ధతు ఇస్తారంటూ సర్వే నిర్వహించి వైసీపీ తదితర టీడీపీయేతర పార్టీలకు చెందిన ఓటర్ల పేర్లను తొలగిస్తూ రాష్ట్ర యువమంత్రి నారా లోకేశ్ నాయుడుకు దగ్గర మిత్రుడైన అశోక్  ఐటీ గ్రిడ్ అనే ఐటీ సంస్థ సీఈఓ అడ్డంగా దొరికిన సంగతి తెల్సిందే.ఈ కేసు గురించి మొదట ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన ఎంపీ,సీనియర్ నేత విజయసాయి రెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో సైబరాబాద్ పోలీసులకు పిర్యాదు చేశారు. పిర్యాదు స్వీకరించిన అనంతరం ఈ కేసు విచారణలో పలు సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వస్తోన్నాయి.

దీంతో ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజల ఓట్లను తొలగిస్తుంటే కేసును హైదరాబాద్ లో ఎలా విచారిస్తారు. అసలు తెలంగాణ పోలీసులకు ఏమి సంబంధం .. ఐటీకు మారు పేరు నేనే. సెల్ ను కనిపెట్టిందే నేను.. కంప్యూటర్ కు ఆధ్యుడ్ను నేనే అంటూ ఇలా అసలు విషయాన్ని ప్రక్కతోవ పట్తిస్తూ బాబు అసహానంతో విరుచుకుపడుతున్నారు.దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు బాబుపై సెటైర్ల వర్షం కురిపిస్తోన్నారు.ఈ క్రమంలో తప్పు చేస్తూ అడ్డంగా దొరికి తమ తప్పును కప్పి పుచ్చుకోవడంతో పాటు, తెలంగాణ ప్రభుత్వంపై బురద చల్లేందుకు చంద్రబాబు, లోకేశ్‌ చేసిన మరో ప్రయత్నంపై ప్రస్తుతం ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. డబ్బులిచ్చి మరీ చంద్రబాబు, లోకేష్‌లు తెలంగాణ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయిస్తున్నారనే విషయం స్పష్టమైందని, దానికి ఆధారాలు ఇవిగో.. అని నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారు.

ఈ క్రమంలో #DataChorCBN, #CashForTweet యాష్‌ ట్యాగ్స్‌ ట్రెండ్‌ అయ్యాయి.ఈ యాష్ ట్యాగ్‌లతో టీడీపీ, దాని అనుబంధ సంస్థలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఆధారాలతో సహా ఎండగడుతున్నారు. ఆంధ్ర రాష్ట్ర పౌరుల డేటాను అక్రమంగా ఒక ప్రైవేటు కంపెనీకి అడ్డగోలుగా అప్పజెప్పిన కేసులో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన చంద్రబాబు, లోకేశ్ ఇప్పుడు అతితెలివి ప్రదర్శించి మరోసారి దొరికిపోయారని కామెంట్‌ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల వ్యక్తులకు డబ్బులిచ్చి మరి తెలంగాణ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయిస్తున్నారని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ‘ఓటుకు నోటు కేసుతొ కేసీఆర్‌ బాబుని కరకట్టకు పంపెసాడు. #CashForTweet కేసుతో లోకేష్‌ని కేటీఆర్‌ ఎక్కడికి పంపుతారొ చూడాలి’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు.‘తమ్ముళ్లూ 18 స్టేలూ తెచ్చుకున్న చరిత్ర నాది.. ఈ డేటా చోర్‌ కేస్‌ నాకొక లెక్కా.. మీరే చెప్పండి?, డేటా దొంగల్‌’ అనే ఫన్నీ మీమ్స్‌తో #CashForTweet ట్యాగ్‌ను నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రెండ్‌ చేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat