ఓ అమ్మాయి ప్రభాస్ ను ఎయిర్ పోర్ట్ లో చూసింది. ప్రభాస్ అంటే ఆమెకు ఎంతో ఇష్టం. ప్రభాస్ ను ఎయిర్ పోర్టులో ఫాలో చేసిన ఆ అమ్మాయి ప్రభాస్ దగ్గరకు వెళ్ళింది. ప్రభాస్ తన అభిమానులను ఎలా రిసీవ్ చేసుకుంటాడో చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె అడగ్గానే ఫోటోలు కూడా దిగాడు.. అంతా అయిపోయింది కానీ.. ఆమె ప్రభాస్ ను తాకాలన్న కుతూహలంతో చెంపమీద కొట్టేసింది. కావాలని కాదు.. చిన్నగా తాకితే ఆమె చేయి గట్టిగా తగిలింది. వేరే ఎవరైనా అయి ఉండిఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. కానీ ప్రభాస్ మాత్రం ఆమె చెంప మీద కొట్టినా కనీసం కోపం తెచ్చుకోలేదు.. చిన్న షాక్ కు గురయ్యాడు. ఆ అమ్మాయి గట్టిగా కొట్టిందని ఆ తర్వాత ప్రభాస్ ఎక్స్ప్రెషన్ చూస్తే అర్థం అవుతుంది. అయినా కూడా ప్రభాస్ ఏమీ అనకుండా మరికొందరు అభిమానులతో ఫొటోలు తీసుకుని నెమ్మదిగా వెళ్లిపోయారు. కనీసం చిరాకు పడలేదు. ఎవ్వరిమీదా అరవలేదు.. అందుకే ప్రభాస్ అందరికీ డార్లింగ్ అయ్యారంటూ ఆయన అభిమానులు వీడియోను వైరల్ చేస్తున్నారు.
