తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం రైల్వేస్టేషన్ వద్ద అగ్నిప్రమాదం సంభవించింది.యశ్వంత్‌పూర్-టాటానగర్ ఎక్స్‌ప్రెస్ రైలులో వంట చేసే బోగీ నుండి మంటలు ఎగసిపడ్డాయి.ఈ తెల్లవారుజామున ఘటన చోటుచేసుకుంది.అయితే ఆ బోగీ మధ్యలో ఉండడంతో పక్కబోగీలోని ప్రయాణికులు చైన్ లాగి రైల్‌ను ఆపేశారు.వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన రైల్వే అధికారులు బోగీలను తప్పించారు.వంటే చేసే బోగీ పూర్తిగా కాలిపోగా,పక్క బోగీ పాక్షికంగా కాలిపోయింది.
ఈ ప్రమాదం నుండి ప్రయాణికులందరూ సురక్షితంగా బయటకురాగా రైల్వే సిబ్బంది ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది రావడానికి సరైన దారి లేకపోవడంతో మంటలు ఆర్పేందుకు కొంచెం ఆలస్యం అయిందని రైల్వే అధికారులు చెప్పారు.