అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాలల్లో సంచలనం రేకెత్తిస్తోన్న ఐటీ గ్రిడ్ సంస్థ డేటా దుర్వినియోగం కేసులో అడ్డంగా బుక్ అయిన ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు టీఆర్ఎస్ ప్రభుత్వంపై మరి ముఖ్యంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నిప్పులు చెరిగిన సంగతి తెల్సిందే. నిన్న సోమవారం బాబు సొంత జిల్లా అయిన చిత్తూరు లో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ సైబరాబాద్ ను నేను నిర్మించా. ఐటీను నేనే పరిచయం చేశా. అసలు కంప్యూటర్ను తీసుకొచ్చిందే నేను .టీడీపీను బలహీనపరచాలని చూస్తే వాళ్ల మూలాలను కదిలిస్తా అని హెచ్చరికలు చేసిన సంగతి తెల్సిందే.
దీనిపై స్పందించిన కేటీఆర్ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ట్విట్టర్ సాక్షిగా బాబుపై ఆధారాలను పోస్టు చేస్తూ మరి ట్వీట్ల వర్షం కురిపించారు.ఈ క్రమంలో కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఏ తప్పు చేయనప్పుడు బాబు ఎందుకు భయపడుతున్నాడు. ఒక ఐటీ కంపెనీపై పోలీసులు విచారణ చేస్తుంటే ఆయన ఎందుకు కలవరపడుతున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాలన్న ఇంగిత జ్ఞానం బాబుకు లేదా.. అసలు ఏపీ ప్రజల అనుమతి లేకుండా సీఎం స్థాయిలో ఉన్న బాబు పౌరుల సమాచారాన్ని వేరేవాళ్లకు ఎలా ఇస్తారు .
అసలు పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన ఏపీ ప్రభుత్వం ఓ ప్రైవేటు కంపెనీకి ఇవ్వడం ప్రైవసీ చట్టానికి తూట్లు పొడవడమేనని కేటీఆర్ ట్వీట్ల వర్షం కురిపించారు. ఇంకా ఆయన ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’ అన్నట్లు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మీద ఏడుపులు ఎందుకు చంద్రబాబు ? తెలంగాణ పోలీసుల దర్యాప్తునకు ఏపీ పోలీసులు అడ్డుకోవడం, కోర్టులో తప్పుడు పిటీషన్లు వేయడం లాంటి పరిణామాలు చూస్తుంటే.. ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేటు సంస్థకు అప్పగించడంలో చంద్రబాబు పాత్రను పరోక్షంగా నిర్దారిస్తుంది. ఈ అంశంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ట్వీట్ చేశాడు.