ప్రముఖ స్వచ్ఛంధ సంస్థ భూమి ఒక యాగం తలపెట్టింది, భారతదేశంలోని యువతకు నాణ్యమైన అక్చరాస్యతను పెంపొందించడం. ఇప్పటికే ఎంతో విద్యా వినియోగకరమైన కార్యక్రమాలు చేపట్టిన భూమి మరెన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తోంది. ఇందులో భాగంగా పర్యావరణ కాలుష్యాన్ని సీరియస్ గా తీసుకుంది. పర్యావరణ సమతుల్యతకు మనం చేపట్టాల్సిన బాధ్యతను వివరిస్తోంది. ఈ క్రమంలో సముద్ర ప్రాంతంలో పారిశుధ్యం ఎంతో అవసరం కాబట్టి తాజాగా నెల్లూరులో దాదాపుగా 100మందితో ఈ కార్యక్రమం నిర్వహించింది. పాఠశాల విద్యార్థులు, డిగ్రీ, ఫార్మా విద్యార్థులు, అధ్యాపకులు ఎందరో స్వచ్చందంగా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసారు.
మొత్తంగా 750 కేజీల చెత్తను సముద్ర ప్రాంతంలో సేకరించి డంప్ యార్డుకు తరలించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు చక్ర స్కూల్, శాస్త్ర కాలేజ్ విద్యార్ధులు, ఐలవ్ నెల్లూరు ప్రతినిధులు, భూమి సంస్థ ఎన్జీవోలు వలంటీర్లతోపాటు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్, యువతకు మార్గనిర్దేశకులు గజ్జల సునీల్ కుమార్ తో పాటు ఆయన శిష్య బృందం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వలంటీర్లకు సునీల్ దిశా నిర్ధేశం చేసి ఉత్సాహ పరిచారు. ఇటువంటి కార్యక్రమంలో పాలుపంచుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రతీ ఒక్కరూ సామాజిక బాధ్యతగా చెత్తను పారేయవద్దని డస్ట్ బిన్ లు ఉపయోగించాలన్నారు. దీనినే నిజమైన దేశభక్తిగా భావిస్తే ఇండియా మోస్ట్ క్లీనెస్ట్ సిటీ అవుతుందన్నారు.