తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రేగా కాంతారావు,ఆత్రం సక్కు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార టీఆర్ఎస్ లో చేరిన సంగతి తెల్సిందే. అయితే పార్టీ మారడంపై టీపీసీసీ చీఫ్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేలను ఎంతకు కొన్నారో లెక్కలు చెప్పాలి. పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయాలి.వెంటనే శాసనసభ స్పీకర్ పార్టీ మారినవారిపై వేటు వేయాలని డిమాండ్ చేశారు. ఉత్తమ్ ఆరోపణలపై స్పందించిన ఎమ్మెల్యేలు రేగా,ఆత్రం మీడియాతో మాట్లాడుతూ గౌరవప్రద పదవీలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు అసత్యాలను మాట్లాడుతున్నారు.
సిగ్గులేకుండా ఎందుకు మాట్లాడుతున్నారని వారి ఫైర్ అయ్యారు. ఆదివాసీల ఆత్మగౌరవం దెబ్బతినేలా టీపీసీసీ చీఫ్ మాట్లాడటం పద్ధతి కాదు. టీఆర్ఎస్ విధానాలు నచ్చే పార్టీ మారాము. మా సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను చేర్చుకోవచ్చు కానీ మేము పార్టీ మారకూడదా..?. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఒక్కోక్క ఎమ్మెల్యేకు యాబై లక్షల రూపాయలను ఆఫర్ చేసింది. మేము డబ్బులకు అమ్ముడుపోయేవాళ్లమే అయితే మేము ఆ యాబై లక్షలు తీసుకుని అక్కడే ఉండేవాళ్ళం కదా. అయిన రేవంత్ రెడ్డి,కొండా విశ్వేశ్వరరెడ్డి,కొండ సురేఖను ఎన్ని కోట్లు పెట్టి కొన్నారని వాళ్ళు విరుచుకుపడ్డారు.