ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం హాట్ హాట్ గా మారింది.ఇక్కడ ప్రధానంగా రెండు పార్టీలు హోరాహోరిగా ఉన్నాయి.అధికార పార్టీ టీడీపీ,ప్రతిపక్ష వైసీపీ గట్టిగా ఉన్నాయి.అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నాయకులు వరుస క్రమ పద్దతిలో వైసీపీలో చేరుతున్నారు.దీంతో జగన్ కు మరింత బలం చేరినట్టే. చంద్రబాబు బుజ్జగిస్తున్నా ఆయన మాట వినకుండా టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.ఇప్పుడు చంద్రబాబుకు ఏం చెయ్యాలో తెలియక పిచ్చి కూతలు కూస్తున్నారు.ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబును ఒక ఆట ఆడుకున్నాడు.
“సగం మంది టీడీపీ ఎంపీలు మళ్లీ పోటీ చేయలేమని చేతులెత్తేశారు. ఎమ్మెల్యేల పరిస్థితీ అంతే. యుద్ద శంఖారావం వినపడక ముందే రణ క్షేత్రం నుంచి పారిపోతున్నారు. అర్థమైందా చంద్రబాబూ. మీ పరాజయం ఏ స్థాయిలో ఉంటుందో. లక్షల కోట్లు వెదజల్లినా మీకు డిపాజిట్లు దక్కవు” అని వ్యాఖ్యానించారు.
టీడీపీలో బలమైన ఎంపీలు అందరు వైసీపీ కండువా కప్పుకున్న విషయం అందరికి తెలిసిందే.ఇక ఆ పార్టీకి మిగిలిన ఎంపీలు ఎలాగూ ఓడిపోతామని అర్ధమయిందేమో మరి మళ్లీ పోటీ చేయలేమని చేతులెత్తేశారు.ఇక ఎమ్మెల్యేల పరిస్థితి చెప్పాల్సిన అవసరమే లేదు.ఎన్నికలు ఇంక రాకముందే తట్టా బుట్టా సర్దుకున్నారు.డబ్బు ఉన్నదన్న అహంకారంతో లక్షల కోట్లు వెదజల్లినా టీడీపీకి డిపాజిట్లు కూడా రావని ఆయన ట్విట్ చేసారు.