వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సమర శంఖారావం ఈనెల 5వ తేదీన నెల్లూరులో నిర్వహించనున్నారు. సమరశంఖారావం సభకు భారీఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరులో నిర్వహించే ఈ సభలో పాల్గొని పార్టీ శ్రేణులు, బూత్‌కమిటీ సభ్యులతో మాట్లాడనున్నారు. ఎన్టీఆర్ నగర్ సమీపంలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న ఎస్వీజీఎస్ కళాశాల మైదానంలో ఈ సభ జరగనుంది. ఈ సభకు విచ్చేయనున్న వారికి కుర్చీలు, వాహనాల పార్కింగ్ సదుపాయానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవైపు ఎండలు మండిపోతూ ఉన్నా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు జగన్ సభకు కదం తొక్కుతున్నారు. పెద్దఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఇప్పటికే వైసీపీ శ్రేణులు, బూత్‌కమిటీ సభ్యులు సన్నాహాలు చేసుకుంటున్నారు.