అధికార టీడీపీని ఓడించి వైఎస్సార్సీపీని అధికారంలోకి తెచ్చేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పక్కా ప్లాన్ వేస్తున్నారు జగన్. టీడీపీలో బలమైన నేతలను ఓడించేందుకు పాదయాత్ర నాటినుంచే పెద్దఎత్తున కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో భీమిలీ ఎమ్మెల్యే, మంత్రి గంటా శ్రీనివాసరావును ఓడించేందుకు జగన్ తిరుగులేని వ్యూహాన్ని రచించారు. సామాజికపరంగా, ఆర్థికంగా బలంగా ఉన్న గంటాకు చుక్కలు చూపించేందుకు భీమిలీ మాజీ ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి శ్రీనివాస్ ను వైసీపీలో చేర్చుకున్నారు. ప్రస్తుతం అవంతి పార్టీ పనిమొదలు పెట్టారు తెలుస్తోంది.
అవంతిని బరిలోకి దించడంతో గంటాకు రాజకీయంగా చుక్కలు కనిపిస్తున్నాయట.. భీమిలీ నియోజకవర్గ రాజకీయ పరిణామాలను గమనిస్తే 2004లో కాంగ్రెస్ తరఫున కర్రి సీతారామ్ కాపు కోటాలో విజయం సాధించారు. ఇక 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున అవంతి శ్రీనివాసరావు గెలిచారు. ఆతర్వాత 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి మంత్రి గంటా శ్రీనివాసరావు గెలిచారు. వచ్చే ఎన్నికల్లో గంటాకు ఓడించేందుకు అవంతికి ఎమ్మెల్యే టిక్కెట్‌తో పాటు మంత్రి పదవి కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు అవంతికి కూడా భారీగా అనుచరుల మద్దతు కూడా ఉందట. దీంతో గంటా శ్రీనివారావుకు భారీ ఓటమి తప్పేటట్టు కనిపించడం లేదు.