అధికార తెలుగుదేశం పార్టీకి షాకుల పరంపర కొనసాగుతోంది. పదవులు ఎరవేసినా….ప్రయోజనాల పరంపర లోబర్చుకునే ప్రయత్నం చేసినా….ఆ పార్టీలో ఉండేందుకు నేతలు ఇష్టపడటం లేదు. తమ పదవులకు టాటా చెప్తూ….ప్రతిపక్ష వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు చేరగా మరో ముఖ్య నేత టీడీపీకి గుడ్‌బై చెప్పేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ నేత చల్లా రామకృష్ణారెడ్డి టీడీపీకి రాజీనామా చేయనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. త్వరలో ఆయన వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. చల్లా ప్రస్తుతం సిివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. ఆయన గత కొతకాలంగా టీడీపీలో అసంతృప్తికరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. ఈ ఎపిసోడ్‌తో టీడీపీ ఖంగుతింది.
Post Views: 313