ఏపీలో జరిగిన గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలుపొందిన 23మంది ఎమ్మెల్యేలు,3గ్గురు ఎంపీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార టీడీపీలో చేరిన సంగతి తెల్సిందే. అయితే త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వారికి టికెట్లు ఇవ్వనని టీడీపీ అధినేత,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారంటా.. ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకట రమణ,వైసీపీ తరపున గెలుపొంది ఆ తర్వాత టీడీపీలో చేరిన పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి లకు కష్టమని తేల్చి చెప్పారు.
మరోవైపు ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్, యర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్‌రాజు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ, కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా, బద్వేలు ఎమ్మెల్యే జయరాములు, పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనకు మళ్లీ సీట్లు దక్కే అవకాశం దాదాపు లేనట్లేనని టీడీపీ వర్గాలు అంటున్నాయి. కలమట వెంకట రమణ స్థానంలో పక్క జిల్లా నుంచి వేరే ఎవరినైనా పోటీ చేయించే ఆలోచన చేస్తున్నారు. ఇక గిడ్డి ఈశ్వరి స్థానంలో మాజీ మంత్రి మణికుమారి, బొర్రా నాగరాజుల పేర్లను పరిశీలిస్తున్నారు అని సమాచారం.
వంతల రాజేశ్వరి బదులు చిన్నం బాబూరావు, సీతంశెట్టి వెంకటేశ్వరరావు.. వరుపుల సుబ్బారావు స్థానంలో ఆయన కుటుంబంలోని మరొకరికి, జలీల్‌ఖాన్ స్థానంలో ఆయన కుమార్తెకు సీటు ఇచ్చే యోచనలో ఉన్నారు. బుడ్డా రాజశేఖర్‌రెడ్డికి సీటు ఖరారు చేయకుండా ఏకంగా ఏరాసు ప్రతాప్‌రెడ్డిని రేసులోకి తీసుకొచ్చారు. మణిగాంధీకి సీటు లేదని తేల్చిచెప్పిన చంద్రబాబు.. ఆ స్థానానికి సమర్థుడిని తీసుకురావాలని జిల్లా నేతలకు సూచించడం ఇక్కడ గమనార్హం. చాంద్‌బాషా స్థానంలో ఆయన చేతిలో ఓడిపోయిన కందిగుంట ప్రసాద్, ఉప్పులేటి కల్పన స్థానంలో డీవై దాసు, వర్ల రామయ్య పేర్లను పరిశీలిస్తున్నారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డికి కూడా సీటు ఖరారు చేయలేదని సమాచారం.