Home / ANDHRAPRADESH / ఆ చిన్న “లాజిక్” మరిచిపోయిన చంద్రబాబు..?

ఆ చిన్న “లాజిక్” మరిచిపోయిన చంద్రబాబు..?

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాలలో సంచలనం సృష్టిస్తోన్న అంశం డేటా చోరీ వివాదం. దీని గురించి మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబు ,మంత్రి నారా లోకేష్ నాయుడు టీఆర్ఎస్ ,జగన్ ,మోదీ ఏపీపై కుట్రలు చేస్తూ టీడీపీని బలహీన పరచాలని చూస్తోన్నాయి. అసలు ఏపీకి చెందిన వ్యక్తుల ఆఫీసులపై,కంపెనీలపై తెలంగాణ పోలీసులు ఎలా దాడి చేస్తారని ప్రశ్నిస్తూ ఆరోపించిన సంగతి తెల్సిందే. చంద్రబాబు ,నారా లోకేశ్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందిస్తూ అసలు తప్పే చేయకపోతే చంద్రబాబు అండ్ బ్యాచ్ కు భయమేందుకు. చంద్రబాబుకు దమ్ముంటే విచారణ ఎదుర్కోవాలి. ఓటుకు నోటుకేసులో ఇలాగే అడ్డంగా దొరికి మా ఫోన్లు ఎలా ట్యాపింగ్ చేస్తారని విమర్శించారే కానీ ఎక్కడా కూడా ఆ వాయిస్ నాది కాదు అని ఒప్పుకోలేదు.

ఇప్పుడు కూడా తప్పు చేసి ఇలా బుకాయిస్తున్నాడు. ఏపీకి సంబంధించిన వ్యక్తుల కంపెనీలపై తెలంగాణ పోలీసులు ఎలా దాడి చేస్తారు.ఎలా అరెస్టు చేస్తారని అడుగుతున్నారు. ఉదాహారణకు అమెరికాకు చెందిన వ్యక్తి ఏపీ రాజధాని అమరావతికి వచ్చారు. అమరావతిలో పర్సు పోగొట్టుకున్నారు. ఆ వ్యక్తి పర్సు పొగొట్టుకుంది అమరావతిలో కాబట్టి అమరావతిలో కేసు పెడతాడా..?. లేదు తాను అమెరికాకు చెందిన వ్యక్తిని కాబట్టి అని అమెరికాలో కేసు పెడ్తాడా..?.హైదరాబాద్ కు చెందిన వ్యక్తి ఏపీ ప్రభుత్వం ప్రజల యొక్క వ్యక్తిగత సమాచారాన్ని టీడీపీకి లబ్ధి చేకూర్చే విధంగా ఇస్తోందని హైదరాబాద్ లోని సైబరాబాద్ లో పిర్యాదు చేశారు.

డేటాను తస్కరించిన కంపెనీ హైదరాబాద్లో అది సబరాబాద్ పరిధిలో ఉంది కాబట్టి ఐటీ యాక్ట్ ప్రకారం అరెస్టు చేశారు. ఇంత చిన్న విషయం తెలియని ఆయన కంప్యూటర్ కనిపెట్టాను. అది కనిపెట్టాను అని జబ్బలు కొట్టుకుంటున్నారు.ఏపీ డేటాతో తెలంగాణ ప్రబుత్వానికి అవసరమేంటి?. డేటా చోరీ ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికే కేసు ఎలా అప్పగిస్తాం?. ఐటీ గ్రిడ్‌పై ఫిర్యాదు వస్తే స్పందించడం తప్పా..?. ఏపీ పోలీసులకు తెలంగాణలో పనేంటి..?. చేసింది తప్పు.. మళ్లీ మా ప్రభుత్వం దుమ్మెత్తిపోస్తున్నారు. మా మీద ఆరోపణలు చేయడానికి చంద్రబాబు, ఏపీ ప్రభుత్వానికి సిగ్గుండాలి. మీ డేటాతో మాకేం పని.. ప్రజల్లో పరపతి పోయాక బాబు ఇలాంటి కుయుక్తులు పన్నుతున్నారు. సానుభూతి కోసమే కేసీఆర్‌పై చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా జరగాల్సింది జరిగి తీరుతుంది. చంద్రబాబు, లోకేశ్‌లకు బుకాయింపు మాటలెక్కువ. ఏపీ పౌరుడు తెలంగాణలో ఫిర్యాదు చేస్తే కేసు కూడా ఇక్కడే పెడ్తారు. టీడీపీకి ఆ మాత్రం కూడా తెలియదా..?” అని కేటీఆర్ విరుచుకుపడ్డారు..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat