Home / ANDHRAPRADESH / తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేయబోయి అడ్డంగా దొరికిన చంద్రబాబు, లోకేశ్!..

తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేయబోయి అడ్డంగా దొరికిన చంద్రబాబు, లోకేశ్!..

ఆంధ్ర రాష్ట్ర పౌరుల డేటాను అక్రమంగా ఒక ప్రైవేటు కంపెనీకి అడ్డగోలుగా అప్పజెప్పిన కేసులో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన చంద్రబాబు, లోకేశ్ ఇప్పుడు అతితెలివి ప్రదర్శించి మరోసారి దొరికిపోయారు.ఐటీ గ్రిడ్స్ అనే కంపెనీ దగ్గర ఆంధ్ర ప్రదేశ్ ప్రజల వ్యక్తిగత వివరాలతో సహా డేటా అంతా దొరకడం, సదరు డేటాను తెలుగుదేశం పార్టీ ఆంధ్రలో ఓటరు లిస్టులను ప్రభావితం చేసేందుకు ఉపయోగిస్తుందనే ఆరోపణ రావడంతో ఉలిక్కిపడ్డ చంద్రబాబు, లోకేశ్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంపై దొంగే దొంగా దొంగా అన్నట్లుగా ఎదురుదాడికి ప్రయత్నిస్తున్నారు.ఇందులో భాగంగానే నిన్న ట్విట్టర్లో #TSGovtStealsData అనే హ్యాష్ ట్యాగును ట్రెండ్ చేయడానికి ప్రయత్నించారు. అయితే ఈ హ్యాష్ ట్యాగుపై వస్తున్న ట్వీట్లను పరిశీలించగా దిగ్బ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి.

అసలు ఆంధ్రతో కానీ, తెలంగాణతో కానీ ఏ సంబంధం లేని కొన్ని వేల ట్విట్టర్ అకౌంట్ల నుండి ఈ ట్వీట్లు వచ్చాయి. ఇందులో అనేక హ్యాండిల్స్ ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల వారు చేసినవి. ఇందులో తెలుగులో వచ్చిన ట్వీట్లు కూడా అసలు తెలుగు భాష రాని వారి ట్విట్టర్ అకౌంట్ల నుండి రావడం గమనార్హం.కొంచెం లోతుగా తవ్విచూస్తే, తెలుగుదేశం పార్టీ ఈ ట్విట్టర్ హ్యాష్ ట్యాగును కృత్రిమంగా ట్రెండ్ చేయడానికి ఒక ఏజెన్సీకి భారీ ఎత్తున డబ్బు ముట్టజెప్పిందని, వారు వేలాది ఫేక్ ట్విట్టర్ హ్యాండిల్స్ ను కిరాయికి మాట్లాడుకుని ఈ ట్వీట్లను చేపించారని తెలిసింది.

అందుకే బొంబాయికి చెందిన రియా అనే ఒక మోడల్, సంతోష్ షుక్లా అనే యాక్టరు, బాలీవుడ్ చోక్ అనే గురుగ్రాం ట్విట్టర్ అకౌంట్ వీళ్లందరూ ఈ అంశం గురించి, చంద్రబాబుకు మద్ధతుగా ట్వీట్ చేశారు. గమ్మత్తేమిటంటే ఈ ట్విట్టర్ అకౌంట్లు అన్నిటిలో ఒకే విధమైన ట్వీట్లు ఉండటం.ఈ ట్వీట్లు చేసిన వారందరూ రోజూ ఎవరు డబ్బులు ఇస్తే వారికి ట్వీట్ లు చేసిపెట్టే కిరాయి మనుషులు. ఒక తప్పుడు పనిని కప్పిపుచ్చుకోవడానికి ఉల్టా తెలంగాణ ప్రభుత్వం మీద ఎదురుదాడికి ప్రయత్నించిన చంద్రబాబు, లోకేశ్ ఇప్పుడు ఈ క్యాష్ ఫర్ ట్వీట్ స్కాములో మరోసారి బుక్కయ్యారు.

డబ్బులిచ్చి ట్విట్టర్‌లో తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ప్రయత్నించిన చంద్రబాబు, లోకేశ్‌లు దేశవ్యాప్తంగా ఇజ్జత్ పోగొట్టుకునుడే కాదు, ఇప్పుడీ అంశంపై అటు సైబర్ క్రైం వారికి, ఇటు ట్విట్టర్ వారికి ఫిర్యాదులు వెళ్లనుండడంతో ముందు ముందు వారిరువురికీ చుక్కలు కనిపించనున్నాయి.చంద్రబాబు, లోకేశ్ వాడిన కిరాయి ట్విట్టర్ మూక మొత్తం గుట్టు లాగాం. మచ్చుకు కొన్ని స్క్రీన్ షాట్లు మీకోసం. ఇంతగా బరితెగించింది ఈ దొంగల ముఠా!

Source -Dileep Konatham గారు తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat