అంతా అనుకున్నదే జరిగింది..గత కొన్ని రోజుల నుంచి సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నారనే వార్త సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఇవాళ త్వరలోనే టీఆర్ఎస్లో చేరుతున్నానని అయన అధికారంగా ప్రకటించారు.పార్టీ కార్యకర్తలతో సమావేశమై.. టీఆర్ఎస్లో ఎప్పుడు చేరాలనేది నిర్ణయిస్తానన్నారు.కాగా నిన్న రాత్రి ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరుతునట్లుగా ప్రకటించగా.. ఇప్పుడు సండ్ర కూడా అదే బాటలో చేరారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆశలు గల్లంతైనట్టే అని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.