వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ‘ఇండియా టుడే’ నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ‘ఢిల్లీ పీఠంపై ఎవరు కూర్చుంటారో దక్షిణాది ఎలా నిర్ణయిస్తుంది?’ (‘హౌ ది డెక్కన్ విల్ డిసైడ్ హూ సిట్స్ ఇన్ ఢిల్లీ) అనే అంశంపై ‘ఇండియా టుడే’ శుక్ర, శనివారాల్లో సదస్సు నిర్వహిస్తోంది. ప్రతిపక్ష నేత హోదాలో వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఈ సదస్సులో ప్రసంగించారు. ఇండియా టుడే ప్రతినిధులు అడిగిన అన్ని ప్రశ్నలకు జగన్ హుందాగా సమాధానాలిచ్చారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా ఆవశ్యకత, దేశరాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ స్థానంపై జగన్ మాట్లాడిన తీరు ఆశ్చర్యపరచింది. ప్రత్యేక హోదా కచ్చితంగా ఏపీకి ఇవ్వాలని, విభజన చట్టంలోని ప్రతీ అంశాన్ని నెరవేర్చాలని జగన్ కోరారు. రాష్ట్రానికి ఏం కావాలనే అంశాలపై జగన్ సూటిగా మాట్లాడిన విధానాన్ని జాతీయమీడియా సైతం మెచ్చుకున్నది.
