సినీ నటుడు మోహన్‌బాబు మరోమారు హాట్ హాట్ కామెంట్లు చేశారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు చంద్రబాబు తనకు ఎంతో సన్నిహితుడని, విద్యానికేతన్ కళాశాల గొప్పదని చంద్రబాబే స్వయంగా చెప్పారని గుర్తుచేశారు. అయితే, 2014-15 సంవత్సరం నుంచి విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఇవ్వలేదని మోహన్ బాబు.. మండిపడ్డారు. అప్పుడప్పుడు మా కాలేజీకి భిక్షమేస్తూ వచ్చారని సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మోహన్ బాబు… విద్యానికేతన్ విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీఎంబర్స్‌మెంట్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్ పై ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందన లేనది మండిపడ్డారు.
ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాడని మోహన్‌బాబు మండిపడ్డారు. విద్యాభివృద్థికి ఏపీ సర్కార్ ఏ మాత్రం పనిచేయడం లేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇంటింటికి తిరిగి ఎందుకు వాగ్థానాలు చేస్తున్నారు చంద్రబాబు అంటూ మోహన్ బాబు ప్రశ్నించారు. అమలు కాని హామీలెందుకు ఇస్తున్నారని నిలదీశారు. నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు.. ఏ రాజకీయ పార్టీ ప్రోత్సాహంతో నేను మాట్లాడడం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.
Tags ap Chandrababu colleges fees rembersment mohan babu tdp