Home / 18+ / తమకు అన్యాయం జరుగుతోందంటూ చంద్రబాబుకు లేఖ రాసిన మేల్ నర్సులు.. చర్యలు తీసుకోవాలని వినతి

తమకు అన్యాయం జరుగుతోందంటూ చంద్రబాబుకు లేఖ రాసిన మేల్ నర్సులు.. చర్యలు తీసుకోవాలని వినతి

లింగ వివక్షతో జాబులు కల్పించకపోవడము అంటే రాజ్యంగం మాకు ఇచ్చిన హక్కు ను హరించడమేనంటూ మేల్ నర్సులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రాసిన లేఖ యధాతధంగా..
మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.
నమస్కరించి వ్రాయునది ఏమనగా..

విషయం: నర్సింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి సమస్యలు మరియు. మేల్ నర్సుల పట్ల అధికారులు చూపిస్తున్న లింగ వివక్ష ..
నియామకాల్లో మేల్ నర్సులకు జరుగుతున్న అన్యాయం. భారత రాజ్యాంగం మాకు కలిపించిన హక్కును అధికారులు అమలు చేయకపోవడము గురించి..

అయ్యా
గత వారం రాష్ట్రంలో 155 స్టాఫ్ నర్స్ జాబులకు 2019వ సంవత్సరం ఫిబ్రవరిన ఉద్యోగ ప్రకటన వస్తే లింగబేధం లేకుండా అందరు ఆప్లికేషన్ పెట్టుకున్నారు కానీ ఎమ్ జరిగినదో చూడండి రాష్ట్రంలో ఉన్నఅధికారులు నర్సుల నుండి వేలసంఖ్యలో ఆప్లికేషన్ వచ్చేసరికి మా అప్లికేషన్ తీసుకోవడం లేదు.
మేము అనగా పురుష నర్సులు రాష్ట్రంలో చదువుకోవడానికి ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నుండి అనుమతి లభించింది. 2005లో కదా.. జీవో.నెం. 82(08/05/05) జారీ అయింది.. దింతో నర్సింగ్ కళశాలలో పురుష నర్సులకు చదువుకోవడానికి అవకాశం లభించినది. 2006 లో మే 8వ తేదీన జారీచేసిన జీవో 320 ఆధారంగా కాళశాలలో అడ్మిషన్లు చేపట్టారు..

అయ్యా
ఇపుడు చెప్పండి..
పురుష నర్సులకు చదువు కోవడానికి అనుమతి లభించిన్నది 2005 లో అయితే.. ఇంకా పాతకాలంనాటి జీవో లను పట్టుకొని ఉద్యోగానికి పురుష నర్సులు అర్హులు కాదు. అని ఎలా చెప్పగలుగుతున్నారు.
2005 లో పురుష నర్సులకు చదువు కోవడానికి ప్రభుత్వాలే కదా అనుమతి ఇచ్చింది.. స్టయిఫండ్, స్కాలర్షిప్ ఇచ్చి చదివించిన ప్రభుత్వాలు ఉద్యోగానికి ఎలా అర్హులు కారని చెప్పగలరు.. జీవోల సవరణ చేయాలని ఎన్నడయినా అధికారులు ప్రభుత్వానికి విన్నవించారా ఇప్పటికీ దాదాపుగా పది సంవత్సరాలు దాటినా ఆ జీవోలను మార్చలేదు పురుష నర్సుల రోదన అరణ్యరోదనే.. కానీ మన రాజ్యాంగం చెబుతున్నది ఏమంటే..

Unjust, against the public polity in providing Public employment and violative of Article 14 and 16 of the Constitution of india and consequently declare that all the applicants eligible….

ఈ విషయంలో మేము కోర్టు గడపలు ఎక్కితే.. కోర్టు ఇచ్చిన సందేశం.. సారాంశం.. ఇలా ఉంది..
Accordingly, the O.As are dismissed.
Interim directions stand vacated. VMA are allowed .M.As. stand closed. The applicants are , however, at liberty to make representations to the Government for amending the rules after the selection process is completed and the GOVERNMENT IS AT LIBERTY TO CHANGE THE RULES.. ఇప్పటికి ఆ రూల్స్ చేంజ్ అవ్వలేదు.. మా బతుకులు మారడం లేదు. మాపట్ల దయఉంచి చర్యలు తీసుకొంటారని ఆశిస్తున్నాము.
అప్లికేషన్ చివరి తేదీ 5/03/19
ఇట్లు,
నర్సింగ్ ఆఫీసర్స్ అస్సోసిషన్
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat