వాల్తేరు డివిజన్‌ను విశాఖ రైల్వేజోన్‌లో కలిపేంత వరకు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదని వైసీపీనేత గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. ఎన్నికల సమయం వచ్చే సరికి ప్రతిపక్షనేత జగన్‌మోహన్‌రెడ్డిపై చంద్రబాబు బురదల్లే ప్రయత్నం చేస్తున్నారని, చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. లోకేష్ ఒకసారి వైద్యులకు చూపించుకుంటే మంచిదన్నారు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు వ్యాఖ్యలు చూసి ప్రజలంతా ముక్కున వేలేసుకుంటున్నారన్నారు. ఐదేళ్ల కాలంలో చంద్రబాబు ఏపాలన చేశారో, ఏ రకంగా దోపిడీ చేశారో రాష్ట్ర ప్రజల మనోభావాలను కాలరాశారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామని తెలుసుకొని సంస్కారంతో ఆలోచన చేసి మాట్లాడాలనిచ, లోకేష్ మాటలు విన్ని ప్రజలు నవ్వుకుంటున్నారు. విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు చేస్తున్నారే ప్రకటన వచ్చిన తరువాత, లోటుపాట్లు అన్ని వైసీపీ ఎత్తిచూపిందని, జరిగిన అన్యాయానికి జగన్ కారణం అని లోకేష్ మాట్లాడుతన్నారని, లోకేష్‌కు ఏమైనా ఆలోచన ఉందా. అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆరు నెలల్లో రైల్వేజోన్ ఇవ్వాలన్నారు. జోన్ గురించి చంద్రబాబు ఏరోజైనా పోరాటం చేయలేదని, జగన్ పోరాటం వల్లే రైల్వేజోన్ ప్రకటన వచ్చిందన్నారు. వాల్తేరు డివిజన్ పూర్తిగా విశాఖపట్నం రైల్వేజోన్‌లో కలపాలని డిమాండ్ చేసారు.