ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పూర్తి చేసిన ప్రజాసంకల్పయాత్రను ప్రతి జిల్లాలో విజయవంతంగా ఆయా నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, ఎమ్మెల్యేలతోపాటు ముఖ్య నేతలు ఒక బాధ్యత అనుకోని ఒక పండగలా ఎర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. అయితే దృష్టిలో పడేందుకు, టిక్కెట్ల రేసులో పోటీ పడేందుకు ఆయా నేతలు పోటి పడి మరి ఎర్పాట్లు చేశారని తెలుస్తుంది. వైఎస్ జగన్ సన్నిహితులు కూడా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జుల బలాబలాలు, బలహీనతలు అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు పార్టీ అధినేతకు చేరవేస్తున్నారు.ఇందులో బాగాంగానే 2019 ఎన్నికల అభ్యర్థులను ఇప్పటికే సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. గత కొన్ని రోజుల నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాల వారీగా కొంతమంది అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నాడు.తాజాగా వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గలకు సంబంధించి 2019 ఎన్నికల్లో పోటిచేసే తన పార్టీ అభ్యర్థులను ఒకేసారి 150 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటిస్తున్నట్లు విస్వసనీయ సమచారం. ఇప్పటి వరకు అధికారికంగా పార్టీ నుంచి ఎటువంటి సమాచారం అందలేదు. కాని జగన్ మాత్రం 175 నియోజకవర్గాల్లో ఒకేసారి 150 మందితో ప్రకటించే విధంగా పార్టీ కసరత్తు చేస్తున్నట్లు పక్కా సమచారం.మరి ముఖ్యంగా 100% పక్కగా అందిన సమచారం కడప ,నెల్లూరు, కర్నూలు,గుంటూరు ఈ నాలుగు జిల్లాలకు సంబంధించి ప్రస్తుత వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తుంది. మిగత 25 స్థానల్లోనియోజకవర్గాలుగా ఉన్న వైసీపీ సమన్వయకర్తల బలం చూసి ఇప్పటికే జగన్ ఒక నిర్ణయం తీసుకుంటరని టాక్. మార్చి 8 న గాని లేక 10 గాని అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమచారం.మిగత 25 స్థానాలు విడతలవారీగాప్రకటించే విధంగా ఒక ప్రణాళిక తయారు చేసిన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పార్టీలో చేరికలు జరుగుతున్నాయి, ఇంకా చేరికలు అవకాశం ఉంది కాబాట్టి ఎక్కడ అయితే పార్టీ బలహీనంగా ఎందో అక్కడ పార్టీ అభ్యర్థులు చూసి సీటు ఇచ్చే వచ్చే అవకాశం ఉంది,. చూడాలి మరి ఎవరు ఆ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరనేది..