ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ విశాఖలోని రైల్వే మైదానంలో సత్యమేవ జయతే పేరుతో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా విశాఖను చూస్తే మనసు పులకరిస్తుంది. దశాబ్దాల ఆకాంక్షను నెరవేరుస్తూ విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు చేశాం..అంటూ తెలుగులో మాట్లాడి ఆశ్చర్యపరిచారు.సుమారు మోదీ 40సెకన్ల పాటు తెలుగులో మాట్లాడారు. అనంతరం ముఖ్య మంత్రి చంద్రబాబు పై పరోక్షంగా విమర్శలు చేశారు.కేవలం రాష్ట్రంలో తన కుటుంబ వ్యవస్థను నిర్మించుకోవడం కోసమే కొందరు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తాను నిర్భయంగా నిర్ణయాలు తీసుకుంటున్నానంటే తనకు ఎటువంటి భయం లేదన్నారు. భయపడే వాళ్లే మోదీ గో బ్యాక్ అని అంటుంటారన్నారు. ఏ నేత కూడా ఇంతవరకు తీసుకోనన్ని యూటర్న్ లు తీసుకున్న నాయకులు ఏ విధంగా అభివృద్ధి చేయగలరు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు నా పైన ఆరోపణలు చేస్తున్నారు. ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని, ఉనికిని దెబ్బతీసిన కాంగ్రెస్ తో యూటర్న్ నాయకులు జతకట్టారు.అంటూ మోడీ బాబును విమర్శించారు.
