పాక్ ఆర్మీ కస్టడీలో ఉన్న భారత వింగ్ కమాండర్ విక్రమ్ అభినందన్ విడుదల అంశంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్ చేతిలో బందిగా ఉన్న భారత వైమానిక దళం పైలట్ అభినందన్ వర్థమాన్ ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆయన తన హీరోగా కొనియాడారు.
ఒకవైపు ‘దేశంలో స్వార్థ రాజకీయాలు, టీఆర్పీ రేటింగ్స్‌లో మీడియాలో యుద్ధాలు జరుగుతుంటే.. గాయాలపాలై ప్రత్యర్థికి చిక్కిన ఇండియన్ పైలట్ అభినందన్ ధైర్యం కోల్పోకుండా నిబ్బరంగా ఉంటూ.. దేశ రహస్యాలు వెల్లడించేందుకు నిరాకరించారు. విపత్కర పరిస్థితుల్లోనూ గొప్ప ధైర్యసాహసాలను, హుందాతనాన్ని ప్రదర్శించిన అభినందన్‌కు నా సెల్యూట్’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. అభినందన్ నా హీరో.. అతన్ని స్వదేశం తీసుకురండి అంటూ హ్యాష్‌ట్యాగ్‌లు జోడించారు.
What a contrast!! While petty politicking & TRP wars in media plays out back home;
A calm, composed, wounded Indian pilot #Abhinandhan refuses to divulge information. Salute this ultra dignified braveheart for his courage under fire ????#AbhinandanMyHero #BringHimHome
— KTR (@KTRTRS) February 28, 2019