Home / 18+ / జగన్ మగాడ్రా బుజ్జి అంటున్న తెలుగుతమ్ముళ్లు, టీడీపీ శ్రేణులు

జగన్ మగాడ్రా బుజ్జి అంటున్న తెలుగుతమ్ముళ్లు, టీడీపీ శ్రేణులు

ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు.. అలాగే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతి ప్రాంతంలో సొంత ఇల్లు, సొంత పార్టీ ఆఫీస్ కట్టుకుని గృహ ప్రవేశం చేసారు. ఈ విధంగా జగన్ వచ్చారు.. అయితే జగన్ కనుక ఈ సారి ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర రాజధానిని మారుస్తారంటూ గత కొన్నేళ్లుగా తెలుగుదేశం అనుకూల మీడియా, టీడీపీ నేతలు అనేక రకాలుగా చేసిన దుష్ప్రచారం అబద్దం అని ఒక్క గృహ ప్రవేశ కార్యక్రమంతో జగన్ కొట్టి పారేసారు. అలాగే పార్టీ మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా రాజధాని అమరావతి లోనే ఉంటుందని తాము మేనిఫెస్టో లో కూడా పెట్టినట్టు వెల్లడించారు.

అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు అసలు ఇంతవరకు విజయవాడలో కనీసం సొంతఇల్లు కూడా కట్టుకోలేదు.. ఆయన ఉంటున్న ఇల్లు కూడా లింగమనేనికి సంబంధించిన ఓ గెస్ట్ హౌస్.. ఈ విషయాన్ని కూడా చంద్రబాబు మంత్రివర్గంలోని దేవినేని ఉమానే స్వయంగా వెల్లడించారు. చంద్రబాబుకు రాష్ట్ర రాజధాని మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో ఈ ఘటనతోనే అర్థమవుతోంది. అలాగే కోట్లాది రూపాయలతో హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్నారు. తాజాగా జగన్ గృహప్రవేశంతో టీడీపీ నేతలు సైతం మన సీఎం గారు కనీసం ఇల్లు కట్టుకోకుండా అక్రమ కట్టడంలో ఉంటే జగన్ మాత్రం సొంతంగా పర్మినెంట్ ఆఫీస్, ఇల్లు భలే కట్టుకున్నారంటూ చెప్పుకుంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat