ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.పార్టీలు మారడం,ఎమ్మెల్యే సీట్ల కోసం ఎంత డబ్బు ఐన కర్చుపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు.అయితే ఎలక్షన్ లో ఒక అభ్యర్ధి గెలవాలంటే అతడు భారీగా డబ్బు కర్చుపెట్టక తప్పదు.ఈ విషయంపై వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో స్పందిస్తూ..ప్రస్తుతం ఏపీలో కొన్ని నెలలుగా రూ.2వేల నోట్ల కనిపించడం లేదని బ్యాంకులు, ఏటీఎంలలో కూడా పెద్ద నోట్లు మాయమయ్యాయి అని చెప్పుకొచ్చారు.
ఎన్నికలు జరగనున్న సమయంలో ఓటు వేసే అభ్యర్ధులకు డబ్బు పంచిపెట్టడానికి చంద్రబాబు బినామీలు, పార్టీ ముఖ్యులు పెద్ద నోట్లను సేకరిస్తున్నారని చెప్పారు.అంతే కాకుండా చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తున్న కొన్ని కార్పోరేట్ విద్యాసంస్థలు, డీమ్డ్ యూనివర్సిటీలు కూడా రెండు వేల నోట్ల వెంట పడ్డాయి.అందుకే ఎన్ని బ్యాంకులకు,ఏటీఎంలకు వెళ్ళిన ఎక్కడ రూ.2వేల నోట్ల కనిపించడంలేదు.అయితే బాబు ఇంత డబ్బు ఇచ్చిన ఏపీ ప్రజలు చంద్రబాబుని ఇంక నమ్మే పరిస్థితే లేదని చెప్పారు.