వైఎస్ఆర్ కాంగ్రెస్ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని పోలీసులు అక్రమంగా నిర్భందించిన ఘటనపై ఆ పార్టీ అదినేత వైఎస్ జగన్ పరామర్శించారు. కుటుంబంతో సహా లండన్ కు వెళ్లి తిరిగి వచ్చిన జగన్ ఎయిర్ పోర్టు నుంచే చెవిరెడ్డితో ఫోన్ లో మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ చట్టాలను అతిక్రమించి వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెడుతూ వేధిస్తున్న వారిపై గవర్నర్కు, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కార్యకర్తలకు అండగా ఉందాం.. అధైర్యపడొద్దు.. ఆరోగ్యం జాగ్రత్త అన్నా.. అని సూచించారు. చిత్తూరు జిల్లాలో పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్న తీరు, ఓట్ల తొలగింపునకు జరుగుతున్న కుట్రలను జగన్కు చెవిరెడ్డి ఫోన్లో వివరించారు. పార్టీ అధినేతతో కొద్ది నిమిషాలపాటు చెవిరెడ్డి జరిగిన ఘటనలను వివరించారు.