నందమూరి బాలకృష్ణ నటించి, నిర్మించిన ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మహానాయకుడు కూడా కధానాయకుడులాగే బాక్సాఫిస్ వద్ద నిరాశపర్చింది. దీంతో ఈ సినిమాపై వైసీపీ ఎంపీ వేణుంబాక విజయసాయి రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేసారు. ‘నందమూరి హీరో, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ నటించి, నిర్మించిన ఎన్టీఆర్ బయోపిక్ పేరుతో వచ్చిన పార్ట్-2లో చంద్రబాబు వెన్నుపోటు పొడవలేదు, పార్టీని రక్షించిన హీరో అని చిత్రీకరించారు. భారీ పబ్లిసిటీతో రిలీజ్ చేశారు. చరిత్రను వక్రీకరించారని పసిగట్టిన ప్రేక్షకులు కర్రు కాల్చి వాత పెట్టారు. నరకాసురుడు ఎప్పటికి విలనే, హీరో కాలేడు.’ అంటూ ట్వీట్ చేశారు.
గెలుస్తామనే ఆత్మ విశ్వాసం ఉన్నవాళ్లు దేనికీ భయపడరని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా విజయాన్ని అడ్డుకోలేరని ధైర్యంగా చెప్పుతారని, పతనం తప్పదని గ్రహించిన వాళ్లే ఇతరులపై ఏడుస్తారన్నారన్నారు. వాళ్లెవరెవరో కలిసి పోయారు. చూశారా ఆయన్నుఈయన తిట్టడం లేదు. కుట్ర పన్నుతున్నారంటూ క్షణక్షణం వణికిపోతుంటారని పేర్కొన్నారు. కమీషన్ల కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని అమ్మేస్తున్నాడని విమర్శించారు. ట్విట్టర్, ఫేస్ బుక్ లు చూపిస్తూ అరెస్ట్లు చేయొద్దంటూ 2015లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తెలియదా.. మీరేం ఐటీ మంత్రి లోకేషూ అని ప్రశ్నించారు. ముందు మీ డాడీ షాడో నుంచి బైటకు రావాలని కోరారు. చింతమనేని దళితులను దూషించే వీడియో తాను పోస్ట్ చేస్తున్నానని, ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోవాలని సవాల్ విసిరారు.