గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మించుకున్న కొత్త ఇంటిలోకి ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈరోజు ఉదయం గృహప్రవేశం చేశారు. ఉదయం 8.19 గంటలకు జగన్, భారతి దంపతులు కొత్త ఇంట్లో అడుగుపెట్టారు. అయితే వైఎస్ జగన్ కొత్త ఇంటిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ కు లోటస్ పాండ్ లో ఒక ప్యాలెస్, పులివెందులలో ఇంకో ప్యాలెస్ ఉన్నాయని… ఇప్పుడు తాడేపల్లిలో మరో ప్యాలెస్ నిర్మించుకున్నారని… ప్యాలెస్ లేకపోతే జగన్ ఉండలేరని ఎద్దేవా చేశారు. తాడేపల్లి ప్యాలెస్ పూర్తయ్యేంత వరకు జగన్ హైదరాబాద్ ను వదిలి రాలేదని విమర్శించారు. టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ సందర్భంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
