ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మరో టీడీపీ ఎంపీ బిగ్ షాక్ ఇవ్వనున్నారు. ఈ క్రమంలో 2014లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కాకినాడ నుండి టీడీపీ తరపున గెలుపొందిన ఎంపీ తోట నరసింహులు ఈ రోజు మంగళవారం ఆయన స్వగ్రామం అయిన కిర్లంపూడి మండలం వీరవరంలో వైసీపీ సీనియర్ నేత,మాజీ మంత్రి బోత్స సత్యనారాయణతో భేటీ అయ్యారు.. వీరివురూ దాదాపు ఆర్ధగంట పాటు చర్చలు జరిపారు అని సమాచారం. రానున్న ఎన్నికల్లో తన సతీమణికి జగ్గంపేట అసెంబ్లీ స్థానాన్ని కేటాయించాల్సిందిగా తోట నరసింహాం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడ్ని అడిగారు. అయితే ఇటీవల వైసీపీ తరపున గెలుపొంది టీడీపీలో చేరిన జ్యోతుల నెహ్రూ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండటంతో బాబు తోటకు నో చెప్పారు. దీంతో చేసేది ఏమి లేక తోట వైసీపీ వైపు చూస్తున్నారు. అందులో భాగంగానే తోట ఈ రోజు బోత్సతో సమావేశమయ్యారని సమాచారం. జగన్ నుండి గ్రీన్ సిగ్నల్ రావడమే ఆలస్యం వైసీపీలో చేరాలని తోట కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు అంట.
