టీడీపీ ఎన్నికల ప్రచార అస్త్రమైన పోలవరం ప్రాజెక్టు వద్ద మరో ప్రమాదం.భూమి కంపించడంతో పగుళ్ళు ఏర్పడ్డాయి.ఈ ప్రాజెక్టు వద్ద ఇలాంటి సంఘటన జరగడం ఇది రెండోసారి..కాగా ఇంతకముందు రెండు కిలోమీటర్ల మేర రోడ్డు పగుళ్లు ఏర్పడిన విషయం అందరికి తెలిసిందే.తాజాగా స్పిల్వే రెస్టారెంట్ వద్ద భూమి కంపించింది.దీంతో సందర్శించడానికి వచ్చిన ప్రజలు భయాందోళనలో పరుగులు తీయడంతో జలవనరుల శాఖ అధికారుల్లో కలవరానికి దారి తీసింది.
దీనిపై ట్విట్టర్ లో స్పందించిన వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇంకుడు గుంతలు కట్టుకునేవాడు ఇరిగేషన్ ప్రాజెక్టు కడితే ఇలానే ఉంటుందని కౌంటర్ ఇచ్చారు.ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ ప్రాజెక్టు పేరు గొప్పగా చెప్పుకుని గెలవాలి అనుకుంటున్నారు..ఇందుకుగాను వేళ కోట్ల వృధా చేసారని మండిపడ్డారు.ఇలాంటి పగుళ్ళు చుపించడానికేనా 400కోట్లు కర్చు పెట్టి ప్రజలను సందర్సన పేరుతో తీసుకెళ్ళింది అని ప్రశ్నించారు.ప్రజలు ఎలాంటి మాటలు చెప్పినా నమ్మి ఓటేస్తారని అనుకుంటే బోల్తా పడతారని చెప్పారు.ప్రజలు ఈసారి సరైన బుద్ధి చెబుతారని అన్నారు.