జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ ఆసక్తికరమైన పరిణామంతో తెరమీదకు వచ్చారు. రాయలసీమ పర్యటనలో ఉన్న పవన్.. ఇవాళ కర్నూలులో విద్యార్థులతో భేటీ అయ్యారు. వారి సమస్యలపై మఖాముఖీ చర్చించారు. అయితే, రేణుదేశాయ్ సడెన్ గా కర్నూల్ జిల్లాలో పర్యటించిన అందరికి దృష్టిని ఆకర్షించారు. ఓ ఛానల్ ప్రచార కార్యక్రమం కోసం ఆమె ఈ టూర్ వేశారు.
కర్నూలు జిల్లాలోని మంత్రాలయం, ఆలూరు నియోజకవర్గాల్లో రేణు దేశాయ్ సోమవారం పర్యటిస్తున్నారు. ఆలూరు మండలంలో రెండు కుటుంబాలకు చెందిన రైతులు ఆత్మహత్య చేసుకోగా రేణు దేశాయ్ వారి కుటుంబాలని పరామర్శించారు. దీంతోపాటుగా, రైతుల సమస్యల నేపథ్యంలో తాను ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించిన రేణు దేశాయ్ ఈ చిత్రం కోసం తాను ముందుగా రైతుల సమస్యలని అధ్యయనం చేసేందుకు ఈ టూర్ వేసినట్లు సమాచారం. అయితే, సీమలో రైతుల కష్టాలను, వారి జీవన విధానాన్ని తెలుసుకునేందుకు ఇక్కడి పల్లెల్లోని ప్రజలను కలుసుకుంటున్నారామె. రైతు ఆత్మహత్యలకు కారణాలను తెలుసుకుని, ఆ పరిస్థితి రాకుండా చేయాల్సిన పనులపై చర్చిస్తున్నారు. బలవన్మరణాలకు పాల్పడిన అన్నదాతలను పరామర్శిస్తున్నారు. రైతులను కలుసుకోవడంపై ఆమెను మీడియా ప్రశ్నించగా.. తాను ఓ చానెల్ లో రైతులపై ప్రోగాం చేస్తున్నానని చెప్పారు. రైతు సమస్యలపై సమాజానికి అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ అన్నదాతల ఇబ్బందులపై స్పందించాలని ఆమె అన్నారు.
ఇదిలాఉండగా, రాయలసీమ పర్యటనలో ఉన్న పవన్.. ఇవాళ కర్నూలులో విద్యార్థులతో భేటీ అయ్యారు. వారి సమస్యలపై మఖాముఖీ చర్చించారు. విద్యార్థులు చెప్పినవన్నీ విన్న పవన్.. వారి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. జనసేన అధికారంలోకి వస్తే మండలానికో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ పెడతామన్నారు. ప్రభుత్వ విద్యలో కొత్త పాలసీ తెచ్చి, లోపాలను సవరిస్తానని అన్నారు. కర్నూలును అమరావతిని మించిన నగరంగా అభివృద్ధి చేస్తానని పవన్ హామీ ఇచ్చారు.