ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.అయితే ఇది జరిగి 12రోజులు కాగా ఈరోజు భారత్ సైన్యం ప్రతీకారం తీర్చుకుంది.ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడి చేసింది.మంగళవారం తెల్లవారు జామున 3.30 గంటలకు భారత నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ) వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భయంకరమైన దాడులు చేసారు.ముజఫరాబాద్ ప్రాంతాల్లో ఉన్న జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలకు సంబంధిత కంట్రోల్ రూంలను వెయ్యి కేజీల బాంబులతో ఎటాక్ చేసి మొత్తం ధ్వంసం చేసారు.ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 12 మిరాజ్-200 యుద్ధ విమానాలతో సర్జికల్ స్ట్రైక్ 2ను విజయవంతం చేసి వీరమరణం పొందిన జవాన్లకు ఘనంగా నివాళులు అర్పించింది.దీంతో సుమారు 300లకు పైగా ఉగ్రవాదులు మరణించి ఉంటారని అనుకుంటున్నారు.