తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా కౌశల్ గెలుపొందిన విషయం తెల్సిందే. ఒక సామాన్య సెలబ్రెటీగా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన కౌశల్ విజేతగా నిలుస్తాడని ఏ ఒక్కరు అనుకోలేదు. సీజన్ 2 ప్రారంభం అయిన సమయంలో విజేత ఎవరు అంటే గీతా మాధురి – తనీష్ – తేజస్వి ఇంకా ఒకరు ఇద్దరు పేర్లు వినిపించాయి. కాని ఏ ఒక్కరు కూడా కౌశల్ గెలుస్తాడంటూ నమ్మకంగా చెప్పలేదు. కాని ఎప్పుడైతే కౌశల్ ఆర్మీ ఫామ్ అయ్యిందో అప్పటి నుండి కూడా కౌశల్ గెలవడం ఖాయం అని అంతా అనుకున్నారు. అదే ఊపుతో విజేత గా నిలిచారు. అయితే తాజాగా కౌశల్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఎన్నికలకు జిల్లా తెలుగుదేశం పార్టీ సన్నద్ధమవుతోంది. లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులపై కసరత్తు చేస్తుంది . ఇందులో బాగాంగానే ఆదివారం రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంట్లో నగర పరిధిలోని ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, వాసుపల్లి గణేష్‌కుమార్, పి.గణబాబు, పల్లా శ్రీనివాసరావుతోపాటు పార్టీ రూరల్ అధ్యక్షుడు, ఎలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు సమావేశం అయ్యారు. విశాఖపట్నం, అనకాపల్లి లోక్‌సభ స్థానాలతోపాటు విశాఖ ఉత్తర నియోజకవర్గ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. విశాఖ జిల్లాలో మూడు లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. అరకులోయ ఎస్టీ రిజర్వుడ్ స్థానం. పోతే మిగిలిన విశాఖపట్నం, అనకాపల్లి స్థానాల్లో ఒకటి బీసీకి ఇస్తే మరొకటి ఓసీ/కాపులకు కేటాయించాలనే ప్రతిపాదన నేతల సమావేశంలో వచ్చింది. అభ్యర్థులపైనా చర్చ జరిగింది. విశాఖ నుంచి పోటీకి అవకాశం ఇస్తే అనకాపల్లి నుంచి కాపు సామాజిక వర్గ అభ్యర్థిని ఎంపిక చేయాలనే చర్చ వచ్చింది. కాపు అయితే ఎలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు పేరు ప్రస్తావనకు వచ్చింది. అదేవిధంగా ఇటీవల బిగ్‌బాస్ షో విజేతగా నిలిచిన కౌశల్ (కాపు సామాజికవర్గం) కూడా పోటీకి ఆసక్తి చూపుతున్నట్టు తెలిసింది. అందుకే టీడీపీలోకి ఆహ్వనించి టిక్కెట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై కౌశల్ ఎటువంటి ప్రకటన చెయ్యలేదు..చూడలి మరి ఏం జరుగుతుందో.
