వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌ను ఏకీపారేశారు..వరుస ట్వీట్ లతో కౌంటర్ ఇచ్చారు.
” డియర్ లోకేష్,
మీ నాన్నని ఓడించటానికి, నువ్వు మా కళ్ళ ఎదుట ఇక్కడే ఉండగా… మాకు మోడీ, కెసిఆర్ లతో ఏంపని చెప్పు?
తప్పమ్మా, ఇలాంటి మాటలు మాట్లాడితే కళ్ళు పోతాయ్, లెంపలేసుకో!”
“లోకేష్,నీకు జగన్ గారిలోనూ కెసిఆర్ గారిలోనూ మోడీ గారు కనిపిస్తున్నారా? ఆంధ్ర మోడీ, తెలంగాణ మోడీ అని వ్యగంగా ట్వీట్ చేసావు. మోడీ సంగతి తర్వాత ఆలోచిద్డువులే, ముందు నీ బాడీ ముఖ్యంగా మైండ్ సంగతి ఆలోచించు! ఎక్కడన్నా మంచి గ్యారేజ్ లో చూపించుకో.మతిస్థిమితం లేని వాళ్ళు మంత్రిగా అనర్హులు.”
” ట్వీట్లు,ఫేస్బుక్ సాకుగా అరెస్ట్‌లు చేయొద్దంటూ 2015లోసుప్రీంకోర్టు తీర్పు కూడా తెలియని మీరేం ఐటీ మంత్రి లోకేషూ!ఆ రూలు వర్తింపచేస్తే మీ ట్వీట్లకు రోజుకు ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి?మీ డాడీ షాడో నుంచి బైటకు రా.చింతమనేని దళితులను దూషించే వీడియో పోస్ట్ చేస్తున్నాను. చర్యలు తీసుకోండి.” సవాల్ విసురుతూ ట్వీట్ చేశారు ఎంపీ విజయసాయి రెడ్డి.