న్యాచురల్ స్టార్ నాని అంటే ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది లవ్,మాస్,సెంటిమెంట్ ఇవ్వన్ని కలిపితేనే నాని.తన నటనతో కామెడీ మరియు డాన్స్ తో అందరి మనస్సులో మంచి పేరు సంపాదించుకున్నాడు.అంతే కాకుండా మనోడికి ఫాన్స్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.అలాంటి నటుడికి ఫాన్స్ వార్నింగ్ ఇచ్చారు.ఇంతకు అసలు విషయానికి వస్తే నిన్న నాని పుట్టినరోజు.ఈ సందర్బంగా తన కొత్త సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేసారు.ఈ పేరు ఒక్కప్పుడు చిరంజీవి నటించిన సినిమానే.1990లో వచ్చిన గ్యాంగ్ లీడర్…ఈ సినిమా ఎలాంటి విజయం సాధించిందో అందరికి తెలుసు.ఈ చిత్రంతోనే చిరు మాస్ హీరోగా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.
ఇలాంటి సినిమా టైటిల్‌ను ఎలా వాడుతారని మెగా అభిమానులు నానిని ప్రశ్నిస్తున్నారు.ఆ టైటిల్ పెట్టుకునే హక్కు ఒక్క రామ్ చరణ్‌కే ఉందని..టైటిల్ మార్చకపోతే సినిమాను ట్రోల్ చేస్తామని మెగా అభిమానులు నానికి వార్నింగ్ ఇచ్చారు.అయితే ఈ చిత్రానికి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించగా..వచ్చే ఆగష్టులో చిత్రం విడుదల చేస్తామని చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.