దేశ వ్యాప్తంగా మరికొన్ని రోజుల్లో పార్లమెంటు ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని పదహారు ఎంపీ స్థానాలను గెలుపొంది ఢిల్లీని శాసించాలని అధికార టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ శ్రేణులకు,తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి విధితమే. ఈ పిలుపును అందుకున్న టీఆర్ఎస్ ఎన్నారై-సౌతాఫ్రికా శాఖ టీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించడానికి సిద్ధమైంది. గత ఏడాది నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయాన్ని నమోదుచేసిన టీఆర్ఎస్.. అదే దూకుడును లోక్సభ ఎన్నికల్లోనూ ప్రదర్శించడానికి సన్నద్ధమవుతున్న తరుణంలో ఈ ఎన్నికల శంఖారావంలో తమ వంతు కృషి చేయడానికి అన్ని రకాలుగా కృషి చేయడానికి సౌతాఫ్రికా శాఖ నిర్ణయం తీసుకుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపుకై సోషల్ మీడియా, టెలీఫోనిక్ , మన ఎమ్మల్యే కాంపెయిన్ లాంటి కార్యక్రమాలను నిర్వహించి సదరు శాఖ కృషి చేసిన సంగతి తెలిసిందే.తాజాగా ఇదే విధంగా పార్లమెంటు ఎన్నికలకోసం కృషి చేస్తామని ఆ శాఖ తెలిపింది.
Tags "TRS NRI elactions gurrala nagaraju south africa