త్వరలో రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల శంఖారావం కేటీర్ సభలతో శంఖారావం పూరించనుంది . మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా మద్దతుతో ఘనవిజయాన్ని నమోదుచేసిన టీఆర్ఎస్.. ఇప్పుడు మిత్రపక్షం తో సహా 17 లోక్సభ సభ స్థానాలను దక్కించుకోవడానికి సన్నద్ధమవుతున్నది, టీ ఆర్ ఎస్ ఆస్ట్రేలియా శాఖ సభ్యులు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ప్రత్యక్షంగా పాల్గొని విజయం లో బాగస్వాములయ్యారో , అదే విధంగా ఈ ఎన్నికలలోను తమ వంతు కృషి చేయడానికి సంసిద్దమవుతున్నారు . ఆస్ట్రేలియా లోని ఏడు రాష్ట్రాలలో ఉన్న గులాబీ శ్రేణులు వారానికొక బృందంగా వచ్చి ఎన్నికల ప్రచారంలో ప్రత్యక్షంగా పాల్గొననున్నారని టీ ఆర్ ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి తెలిపారు . ఫెడరల్ ఫ్రంట్ ద్వారా కెసిఆర్ భారత దేశానికి ఒక కొత్త ఎజెండా ను పరిచయం చేయనున్నారని కాసర్ల నాగేందర్ రెడ్డి తెలిపారు .
