శాంత్‌నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరంగదుర్ నిర్మించిన చిత్రం ` కేజీఎఫ్`. హిందీతో పాటు దక్షిణాది భాషలన్నింటిలో విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది. ఈ క్రమంలోనే ఈ సినిమా పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసల జల్లు కురుపించారు. కొద్దిగా ఆలస్యంగానే అయినా ఎట్టకేలకు `కేజీఎఫ్` చూశాను. సినిమా అద్భుతంగా ఉంది. సాంకేతికంగా, కథాపరంగా చాలా బాగుంది. పట్టుసడలని స్క్రీన్‌ప్లేతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమాను అద్భుతంగా రూపొందించారు. బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. స్క్రీన్‌ఫై రాక్‌స్టార్ యష్ నటన అదిరిపోయింద`ని కేటీఆర్ ట్వీట్ చేశారు.ప్రస్తుతం కేటీఆర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
May be I am little late but finally watched #KGF What a movie!! Brilliant technically, intense & cool; all at the same time. Superb direction by #PrashanthNeel gripping screenplay, terrific BGM & what a rock star like screen presence! @TheNameIsYash ?
— KTR (@KTRTRS) February 24, 2019