వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలో కొత్త ఇల్లు నిర్మిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే ఇంటికి సంబంధించి అన్ని పనులు చివరి దశకు వచ్చినట్టే.ఈ మేరకు ఆయన ఈ నెల 27న గృహ ప్రవేశం చేయనున్నారు.దీనితోపాటుగా ఆ పార్టీ నూతన కేంద్ర
కార్యాలయాన్నికూడా ప్రారంభించనున్నారు.
జగన్ ఇంటి గృహప్రేవేశానికి గాను పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, పార్లమెంటు జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, ఇతర ముఖ్య నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటూ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రకటనలో తెలిపారు.ఇక అభిమానులకైతే పండుగ వాతావరణం అని చెప్పుకోవాలి.జగన్ అభిమానులు,పార్టీ కార్యకర్తులు భారీఎత్తున ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నారు.ఆ చివరి నుండి ఈ చివరివరకు బాణాసంచా ఏర్పాటులు మారుమోగుతాయి.