Home / 18+ / అదే జరిగితే జనసేన నామ రూపాల్లేకుండా పోతుంది.. ఒంటరిగా బరిలోకి

అదే జరిగితే జనసేన నామ రూపాల్లేకుండా పోతుంది.. ఒంటరిగా బరిలోకి

ఏపీలో ఎన్నికల వేడి మొదలయ్యింది.. ఏ పార్టీ ఎవరితో జట్టు కట్టాలి ఎన్ని సీట్లు అడగాలి అనే అంచనాలు స్టార్ట్ అయ్యాయి. అయితే టిడిపి జనసేన పొత్తు ఉంటుందని భావిస్తున్న తరుణంలో ఈ పొత్తు ఖాయం అనే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే గతంలో పొత్తు పెట్టుకున్న బీజేపిని చంద్రబాబు దూరం పెట్టడంతో ఈ సారి పవన్ తో పొత్తు ఉంటుందని చెప్తున్నారు. అయితే చంద్రబాబు చెప్పిన విషయాల ప్రకారం సుమారు 65నియోజకవర్గాలు టిడిపికి ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి ఈ సమయంలో టిడిపి జనసేనతో పొత్తుతో మాత్రమే ఈ లోటుని భర్తీ చేసుకునే అవకాశం ఉంది.. అందుకే జనసేనతో పొత్తు కి సిద్డమయ్యారు చంద్రబాబు.

జనసేన మాత్రం పార్టీ పెట్టి నాలుగేళ్ళవుతున్నా ఇప్పటికీ సరైన వైఖరితో ముందుకెళ్లట్లేదు. తాజాగా సీఎం చంద్రబాబు కూడా  ఎన్నికల్లో జనసేనతో కలిసి టీడీపీ పోటీ చేస్తే తప్పేంటని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. ఈ వ్యాఖ్యలలో జనసేన రాజకీయ రంగు బయటపడింది. వీళ్లిద్దరూ పార్ట్నర్స్ అని ముందునుండి వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు నిజమయ్యాయి. ఇంతకాలం శత్రువుల్లా నటించిన వీరి బాగోతం బయటపడిందంటూ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ తీవ్రంగా దుమ్మెత్తిపోస్తోంది.

అన్నింటికన్నా ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత కూడా ఈ వ్యాఖ్యలను ఖండించలేదు. చంద్రబాబు వ్యాఖ్యల పట్ల కూడా పవన్ కూడా సానుకూలంగా ఉన్నట్టు కనిపించింది. దీంతో జనసేన పార్టీనేతలు,కార్యకర్తలతో పాటు రాష్ట్ర ప్రజలు సైతం పవన్ వైఖరి పట్ల దుమ్మెత్తిపోసారు. పవన్ కళ్యాణ్ తాజాగా కర్నూలులో నిర్వహించిన సమావేశంలో కార్యకర్తలు అభిమానులు కూడా పెద్ద ఎత్తున టీడీపీతో కలవొద్దంటూ నినదించారు. తెలుగుదేశంతో కలిస్తే జనసేన నామరూపాల్లేకుండా పోతుందంటూ హెచ్చరించారు. మరి పవన్ ఏం చేయబోతున్నారు.. ఎవరెన్ని చెప్పినా తనను చీ కొట్టిన టీడీపీకి మద్దతిస్తారా.. ఎన్నికల రణరంగంలో దూకి తన పార్టీ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తారా అనేది వేచి చూడాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat