ఎన్టీఆర్ బయోపిక్ మహానాయకుడు మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి అందరికి తెలిసిందే.ఈ చిత్రం చూసిన ప్రజలందరికి ఒక విషయమైతే బాగా అర్దమైంది.ఇందులో పాత్రలు గురించి చెప్పుకుంటే..పూర్తిగా విలన్ గా మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావును చూపించగా,హీరోగా చంద్రబాబుని చూపించారు.అయితే దీనిపై స్పందించిన నాదెండ్ల కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.తాను సినిమా చూడలేదని కాని చూసినవారంత తననే విలన్ అనుకుంటున్నారని అన్నారు.నిజానికి ఈ సినిమా ఎన్టీఆర్ వారసులు తీసారు.ఒకపక్క బాలకృష్ణ చంద్రబాబుకి సపోర్ట్ చేస్తూ తన తండ్రిని మోసం చేస్తున్నారు.ఇందులో అసలు విలన్ చంద్రబాబు నాయుడు అని అన్నారు.
నిజాలు చూపించే ధైర్యం వాళ్ళకు లేక ఇలా చేసారని చెప్పుకొచ్చారు.తమ పార్టీలో చేర్చుకోమని చంద్రబాబు తన దగ్గరకు వచ్చాడని,ఎన్టీఆర్ చనిపోవడానికి కారణం తన కుటుంబ సభ్యులేనని,ఆయనను దారుణంగా క్షోభ పెట్టి వత్తిడికి గురిచేసారని చెప్పుకొచ్చారు.ఆయన దాచుకున్న సొమ్ము కోసం కోర్టుకు వెళ్లారని..తన తిండికి కూడా డబ్బులు లేకుండా హింసించారని చెప్పారు.సినిమాలు తీసినంత మాత్రాన నిజాలు మారిపోవని..ఈ సినిమా విషయంలో నోటీసులు పంపించిన కాని వాళ్ళ చేతిలో అధికారం ఉండడంతో ఎవరు దానిని ఆపలేదని అన్నారు.దీనికి ప్రతిఫలం మున్ముందు అనుభవిస్తారని ఆయన చెప్పారు.