మొన్న బావ..ఈరోజు తమ్ముడు..ఏపీ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ పడుతుంది.ఈరోజు తన తమ్ముడైన సోమిరెడ్డి సుధాకర్ రెడ్డి వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.ఇది మంత్రికి ఊహించని షాక్ అనే చెప్పుకోవాలి.మొన్నటికి మొన్న స్వయానా బావ రామకోటారెడ్డి వైసీపీలో చేరిన విషయం అందరికి తెలిసిందే.ఇప్పటికే వైసీపీ నెల్లూరులో క్లీన్ స్వీప్ అని అర్ధమవుతుంది.ఇక ఇక్కడ టీడీపీ అనే మాట ఎవరి నోటా రాదనే చెప్పుకోవాలి.సుధాకర్ రెడ్డి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డికి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అనతరం గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ..తన సోదరుడైన మంత్రి సోమిరెడ్డి అక్రమాలు,అవినీతి పనులు సహించలేకే అందరు టీడీపీని వీడుతున్నారని చెప్పుకొచ్చారు.
మరోపక్క జిల్లాలో ఉన్న టీడీపీ నేతలందరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి లైన్ కడుతున్నారు.వైసీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అధ్వర్యంలో రామతీర్థం మాజీ శివాలయం చైర్మన్ శ్రీనివాసులు, కరుణాకర్, మురళితో పాటు పలువురు టీడీపీని వదిలి జగన్ పార్టీకే వస్తున్నారు.వీరందరూ కూడా టీడీపీ చేస్తున్న పనులు నచ్చడం లేదని..అందరూ అవినీతికి పాల్పడుతున్నారని జిల్లాని నాశనం చేసారని చెబుతున్నారు.రాష్ట్రం బాగుపడాలంటే జగన్ రావాలని కోరుకుంటున్నారు.