మీరెవరైనా ఎమ్మెల్యేగా పోటీ చెయ్యాలి అనుకుంటున్నారా?అయితే ఎవరి కాళ్ళు పట్టుకోవలసిన అవసరం లేదు..ఏపీలో ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న వేళప్రతీ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశ పడుతున్నారు.కాని ఒక్క జనసేన పార్టీలో మాత్రం అలాంటి ఇబ్బందులు లేవనే అనుకోవాలి.ఎందుకంటే ఈ పార్టీలో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఎవరైన ఉంటే “జనసేన స్క్రీనింగ్ కమిటీ” కి అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటన ఇచ్చారు.అవి పరిశీలించిన తరువాత తానే స్వయంగా అభ్యర్థుల ప్రకటన చేస్తానని చెప్పారు.దీనితో అందరూ తమ దరఖాస్తులను ఇస్తున్నారు.
ఇందులో గోదావరి జిల్లాల నుండి ఎక్కువుగా దరఖాస్తులు చేస్తున్నారని తెలుస్తుంది.అసలు విషయానికి వస్తే పవన్ ఈ స్క్రీనింగ్ కమిటీ పెట్టడానికి ముఖ్య ఉద్దేశ్యం ఏంటో ఎవరికైనా తెలుసా..?ప్రస్తుతం జనసేనలో ఆర్ధికంగా గాని లేదా జనాల్లో పలుకుబడి ఉన్నవారు ఎవరూ లేరు,ఉన్నవాళ్ళలో తోట చంద్రశేఖర్, నాదెండ్ల మనోహర్ పేర్లు అందరు మర్చిపోయారనే చెప్పుకోవాలి.దీంతో ఇలాగైన ఇతర పార్టీ సీనియర్ నాయకులు గాని..ఆర్ధికంగా బలంగా ఉన్నవారు వస్తారని ఆయన బావిస్తున్నారు.కాని అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి అన్నట్టుగా ఉంది పవన్ పరిస్థితి.
ఉన్న నాయకులు అందరు వైసీపీలోకి వెళ్తుంటే ఇంక జనసేనలోకి రావడం కష్టం అని తెలుస్తుంది.కాని ఎక్కడో చిన్న ఆశ కనీసం కాపు నేతలైన వస్తారేమో అని..అయితే ఏ ఒక్కరూ ఆసక్తి చూపడం లేదు.ఇక స్క్రీనింగ్ కమిటీకి దరఖాస్తు చేసుకునే వారు అందరూ పవన్ కళ్యాణ్ అభిమానులే.జనాసేనలో పవన్ కి తప్ప ఇంకెవరికి ప్రజాదరణ లేదు.గత్యంత్రం లేక స్క్రీనింగ్ కమిటీ నుంచి ఒకటో రెండో దరఖాస్తులను ఎంపిక చేసి మిగిలినవి పవన్ కి అందుబాటులో ఉన్న సీనియర్లు, సమర్థులకు కీలక పదవులు ఇస్తారని కధనం.