నిన్న శుక్రవారం తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ బయోపిక్ మహానాయకుడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం అందరికి తెలిసిందే.ఎన్టీఆర్ గా స్వయంగా తన కొడుకు బాలకృష్ణ నటించారు.అయితే అందరు అనుకున్నట్లుగానే ఈ సినిమా దారుణమైన ఓపినింగ్స్ చవిచూసింది.బాలయ్య నటించిన సినిమాలలో మరియు క్రిష్ దర్శకత్వం వహించిన ఏ సినిమాకు ఎన్నడూ ఇలాంటి దారుణమైన ఓపెనింగ్స్ రాలేదు.ఇందులో మొదటి భాగమైన కథానాయకుడు ఓపినింగ్స్ లో సగం కూడా రాలేదు అంటే మీరే అర్ధం చేసుకోండి ఇది ఎంతలా దిగజారిపోయిందో.
కాని ఒక్క విషయంలో ఈ చిత్రం మొదటి స్థానం దక్కించుకుంది..అది ఏమిటీ అనుకుంటున్నారా…ఓ సినిమా రిలీజ్ రోజున అతి తక్కువ కలెక్షన్స్ సాధించింది ఏదైనా ఉంది అంటే అది రామ్ గోపాల్ వర్మ ఆఫీసర్ సినిమా.కాని ఇది దానికన్నా తక్కువ వసూళ్ళు రావాడంలో చరిత్ర సృష్టించింది.ఆర్టిసి క్రాస్ రోడ్ లో మహానాయకుడు చిత్రం మొదటిరోజు ₹160641/- గ్రాస్ వస్తే, అదే రామ్ గోపాల్ వర్మ ఆఫీసర్ అక్కడ ₹344718/- గ్రాస్ వసూళ్ళు వచ్చింది.తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశం అభిమానులు,నందమూరి అభిమానులు ఈ సినిమాని పట్టించుకోని దాఖలాలే కనిపించడంలే.ఈ చిత్రం ద్వార స్వర్గీయ ఎన్టీఆర్ మరియు పార్టీ పరువు మొత్తం పోయిందనే చెప్పుకోవాలి.కథానాయకుడు సినిమా ₹50 కోట్ల వరకు నష్టాలు రాగా,మహానాయకుడు ఇంకెంత నష్టం తెప్పిస్తుందో అని డిస్ట్రిబ్యూటర్స్ అనుకుంటున్నారు.