పుల్వామాలో ఉగ్రదాడి అనంతరం రెండు దేశాలమధ్య ఉద్రిక్త వాతావరం నెలకొనింది.దేశమంతా పాక్ పై యుద్ధం చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ మేరకు సీఆర్పీఎఫ్ జవాన్ల మరణానికి ప్రతీకారం తీర్చుకొనే స్వేచ్ఛను భారత సైన్యానికి ఇస్తున్నామని ప్రధానమంత్రి ప్రకటించారు.అంతే కాకుండా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) ఒప్పందం కింద పాకిస్థాన్‌కు ఇచ్చిన అత్యంత ప్రాధాన్య హోదాను భారత్ రద్దు చేసింది.ఇది ఎలా ఉండగా పాకిస్తాన్ మాత్రం ఈ దాడిని సమర్దించుకుంటుంది.
ఈ దాడికి మాకు ఎటువంటి సంబంధం లేదని..ఎలాంటి విచారణ లేకుండా మాపై నిందలు వేయడం సరికాదని చెప్పారు.ఏదైనా ఉంటే ముందు చర్చించుకోవాలని చెబుతున్నారు.ఇవేమీ కాదని మాపై సైనిక చర్యలు చేపడితే మాత్రం భారత్‌కు ధీటుగా సమాధానం చెప్తామని పాక్ సైనిక అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ వ్యాఖ్యానించారు.యుద్ధానికి పాల్పడితే తిప్పికొట్టడానికి మరియు దేశ రక్షణకు కొరకు చర్యలు తీసుకోమని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తమకు అనుమతిచ్చారని తెలిపారు.మా సైన్యం ఇప్పుడు చాలా బలంగా ఉందని,దేనినైన ఎదుర్కుంటామని చెప్పుకొచ్చారు.