Home / 18+ / చంద్రబాబుపై నందమూరి అభిమానులు ఫైర్..బయోపిక్ లోను రాజకీయమే!

చంద్రబాబుపై నందమూరి అభిమానులు ఫైర్..బయోపిక్ లోను రాజకీయమే!

దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు గారి బయోపిక్ రెండు పార్ట్‌లుగా విడుదలైన విషయం అందరికి తెలిసిందే.ఈ రెండు సినిమాలను భారీ బడ్జెట్‌తో ప్రేక్షకులు ముందుకు వచ్చాయి.ఇందులో మహానేత ఎన్టీఆర్ పాత్రలో తన కొడుకు బాలకృష్ణ నటించారు.మొదటి పార్ట్ కథానాయకుడు పేరుతో భారీ అంచనాలతో రిలీజ్ అవ్వగా..బాక్సాఫిస్‌ వద్ద బోల్తా పదిడింది.ఇందులో బాలకృష్ణ నటన వలనే సినిమా మంచి టాక్ రాలేదని అందరు అనుకున్నారు. కథానాయకుడు ఊహించిన రీతిలో టాక్ రాకపోవడంతో దృష్టి మొత్తం పార్ట్ 2గా తెరకెక్కుతున్న మహానాయకుడు పైనే పెట్టుకున్నారు.ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం అందరికి తెలిసిందే.అయితే ఈ చిత్రంలో జరిగిన కధ కన్నా..పార్టీ ప్రయోజనాలు కోసమే తీసీనట్టు అనిపించడంతో ప్రేక్షకులకు నచ్చలేదు.చిత్రానికి ముఖ్య పాత్ర ఐన ఎన్టీఆర్ ది కాకుండా వేరే పాత్రకు ప్రాధాన్యత ఇచ్చినట్టు అభిమానులు చెప్పుకుంటున్నారు.

 

 

కథానాయకుడితో బోర్లాపడ్డ క్రిష్ కనీసం రెండో పార్ట్‌నైనా బాగా తీస్తారని అనుకున్నారు.కాని ఇక్కడ కూడా మంచి ఫలితం చూపించలేకపోయాడు.ఇందులో నాదెండ్ల భాస్కరరావు పాత్రను పూర్తిగా విలన్ గా చూపించగా చంద్రబాబుని హీరోగా చూపించినట్టు తెలుస్తుంది.ఈ సినిమాలో ముఖ్య పాత్ర ఎన్టీఆర్ అవ్వాలి కాని వేరొకరి పాత్ర హైలైట్ చేసారు.ఈమాత్రం దానికి మహానాయకుడి కథ అనేకన్నా చంద్రబాబు బయోపిక్‌ అని టైటిల్ పెడితే సరిపోతుంది కదా అని వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. ఇది చూసాక అందరు చంద్రబాబు ఒకప్పుడు ఎన్టీఆర్‌కి ఇప్పుడు నందమూరి అభిమానులకు వెన్నుపోటు పొడిచారని అంటున్నారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat