అభివృద్ధి పేరున సభాపతి కోడెల, ఆయన కుమారుడు శివరాం, కుమార్తె విజయలక్ష్మి లు అవీనీతికి పాల్పడుతున్నారన్నాని, ఆ దందాపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. కోడెల శివ ప్రసాద్ కుటుంబ అవినీతిపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ.. గుంటూరు జిల్లా సతైనపల్లిలో ఇంతకముందే ఎన్నో సార్లు దర్నాలు కూడ చేశారు. అంతేకాదు సతైనపల్లిలో శివ ప్రసాద్ కుటుంబ అవినీతిపై సమగ్ర న్యాయ విచారణ కోసం దర్నా చేస్తే వారిని ఆరెస్ట్ చేసి సత్తెనపల్లిలో 144 సెక్షన్ అమలుచేశారు. తాజాగా కోడెల, ఆయన కుమారుడు శివరాం నేరాలు గురించి ఒక వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. వీడియో లో ఏముందంటే…
ఎన్నో కాంట్రవర్సీలకు దారుణమైన నేరాలకు కేంద్ర బిందువు కోడెల శివప్రసాద్. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గా సత్తెనపల్లి శాసనసభ్యుడుగా ఈ ఐదు సంవత్సరాలు ప్రజలకు ఏం చేశాడో చూద్దాం.
* ఈ ఐదు సంవత్సరాలు సత్తెనపల్లిలో కోడెల శివప్రసాద్ అతని కుమారుడు శివరామకృష్ణ ఎక్కడ చూసినా భూకబ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు.
*అమాయకమైన ప్రజల దగ్గర నుండి దౌర్జన్యంగా భూకబ్జా చేసి వాళ్లను రోడ్డు పాలు చేశారు.
*ల్యాండ్ మాఫియాలో వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి.
*సత్తెనపల్లిలో ఇప్పుడు అందరి నోట కోడెల టాక్స్ దడ పుట్టిస్తుంది.
*అతను ఎంతటి వాడైనా చిన్నోడు, పెద్దోడు కోడలు టాక్స్ కట్టాల్సిందే, పేదవాడి దగ్గర నుండి బిజినెస్ మ్యాన్ వరకు టాక్స్ కట్టాల్సిందే.
*కాంట్రాక్టర్ల దగ్గర నుండి భారీ మొత్తంలో కమిషన్ బలవంతంగా తీసుకోవడం కోడెలకు అండ్ ఫ్యామిలీ కి వెన్నతో పెట్టిన విద్య.
*బాధ్యతీయుతమైన మున్సిపల్ ఉద్యోగులను తమ సొంత పనులకు వాడుకొని వదిలేయడం జిల్లా మొత్తం మార్మోగింది.
*అన్న క్యాంటీన్ కు వడ్డించే భోజనాలు సైతం దొడ్డిదారిలో అమ్ముకుంటున్న కోడెల అండ్ ఫ్యామిలీ.
*సత్తెనపల్లి లో ఎక్కడ చూసినా కోడెల అండ్ ఫ్యామిలీ దోపిడి ,దౌర్జన్యం, అన్యాయం ,అక్రమం రాజ్యమేలుతుంది.
*ఎదురు తిరిగితే లాఠీ దెబ్బాలు, మాట్లాడితే బెదిరింపులు, కిడ్నాప్ లు, ఎటు పోతుంది ఈ సమాజం… అన్ని తెలిసి చంద్రబాబు ప్రభుత్వం ఏం చేస్తుంది.
మనుషుల మధ్య ఉన్నామా లేక జంతువుల మధ్య ఉన్నామా అని పిస్తుంది. ఇంకెన్నాళ్లు ఈ దోపిడీ కోడెల అండ్ ఫ్యామిలీ అంటూ వీడియో లో ఉంది. ప్రస్తుతం వీడియో వైరల్ గా మారింది.