కర్నూలు జిల్లాలో ఎన్నికలలో పోటీచేసే టీడీపీ అభ్యర్ధులను ఆ పార్టీ అదినేత ,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు.తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కి కర్నూలు లోక్ సభ టిక్కెట్ ను ఖరారు చేశారు.ఆయన భార్య సుజాతమ్మకు ఆలూరు టిక్కెట్ ఇచ్చారు.కాగా వైసీపీలో జెండాపై గెలిచి ఎంపీ అయిన బుట్టా రేణుకకు లోక్ సభ టిక్కెట్ కాని, అసెంబ్లీ టిక్కెట్ ను కాని ఇవ్వడం లేదని సమాచారం. ఆమె ఎమ్మిగనూరు అసెంబ్లీ టిక్కెట్ అయినా ఇస్తారని ఆశించారు. కాని ఆ టిక్కెట్ ను సిటింగ్ ఎమ్మెల్యే జయనాగేశ్వరరరెడ్డికే కేటాయించారు.కాగా పత్తికొండ సీటును ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి కుమారుడు శ్యామ్ బాబుకు , డోన్ సీటును కె.ఇ.ప్రతాప్ కు ఇచ్చారు.మంత్రాలయం తిక్కారెడ్డి పోటీ చేస్తారు. ఇంకా కర్నూలులో ఎస్వి మోహన్ రెడ్డి లేదా టిజి భరత్ ఉంటారు. నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి లేదా ఎవి సుబ్బారెడ్డి, అళ్లగడ్డలో అఖిలప్రియ, బనగానపల్లె లో బిసి జనార్దనరెడ్డి పోటీలో ఉంటారు.కొడుమూరులో ఫిరాయింపు ఎమ్మెల్యే మణిగాందీకి టిక్కెట్ రాకపోవచ్చని సమాచారం.
