తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు మరో పెద్ద షాక్ ఇచ్చారు అవంతి శ్రీనివాస్..ఈయన వైసీపీ కండువా కప్పుకున్న విషయం అందరికి తెలిసిందే.ఈరోజు విశాఖలో వైఎస్ఆర్‌సీపీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా..ఇటు అవంతి వర్గం మరోపక్క మొదటి నుండి వైసీపీలో ఉన్న నాయకులంతా హాజరయ్యారు.ఇక ఒక్కొక్కరుగా మాట్లాడుతూ..చంద్రబాబు పై విరుచుకుపడ్డారు.అనంతరం అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ మంత్రి గంటా శ్రీనివాస్ పై పలు వివాదాస్పద వ్యాక్యాలు చేసారు.తనను నమ్ముకొని ఓట్లు వేసిన వారి భూములనే కబ్జా చేసే గొప్ప వ్యక్తి,ఆ విషయంలో ఐతే నువ్వా నేనా అని కూడా పట్టించుకోడని..ప్లేస్ కనిపిస్తే చాలు ఆ స్థలం కబ్జా అయినట్టేనన్నారు.
ఇంతటి నీచాపు నాయకులకు అండగా ఉన్న చంద్రబాబుకు ప్రజలు సరైన బుద్ధి చెబుతారని,బాబు పతనం ఖాయమని చెప్పుకొచ్చారు.అయన చేస్తున్న అరాచకాలు వల్లే అందరు పార్టీని వదిలేస్తున్నరను..అంతేకాకుండా మరికొద్ది రోజుల్లో ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల నుండి 10మది కీలక నేతను వైఎస్ఆర్‌సీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు.ఒక్కసారిగా బాంబు పేల్చిన అవంతి మాటలకూ చంద్రబాబు అండ్ పచ్చ మీడియా షాక్ లో ఉంది.ఆ 10మంది ఎవరా అని చర్చలు సాగుతున్నాయి.మరోపక్క వైసీపీలో చేరే నేతలకు జగన్ ఈ నెలాకరకు డెడ్‌లైన్ పెట్టారని సమాచారం.ఈ మేరకు పార్టీలోకి ఎవరు వస్తారు అనేది ఇంకొన్ని రోజుల్లో తెలుస్తుంది.