రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి అందరికి తెలిసిందే.మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఐదు స్థానాలకు గాను కేసీఆర్ వీరి పేర్లను ప్రకటించారు.పార్టీ సీనియర్ నేత హోంమంత్రి మహముద్ అలీ, ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్, రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గె మల్లేశం కురమలను టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులుగా సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. మరొక సీటును మిత్రపక్షమైన ఎంఐఎంకు కేటాయించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిందుకు వారు కేసీఆర్‌ను ధన్యవాదులు తెలిపారు.ఈ నెల 28 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మార్చి 1న నామినేషన్ల పరిశీలన, 5న ఉపసంహరణ ఉంటుంది. మార్చి 12న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు.