వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడని మరోసారి రుజువు చేసారు.ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాదిరిగా మాట ఇచ్చి చివరకు ప్రజలను మోసం చేయడం జగన్ కు తెలియదని అర్ధమవుతుంది.మొన్న 17వ తేదిన ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జన సభలో బీసీ సంఘం అధ్యయన కమిటీ చైర్మన్ జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్సీ ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే.ఈ మేరకు గురువారం జంగాకు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,ఎంపీ విజయసాయిరెడ్డి ఆయనకు బీఫారం ఇచ్చారు.దీంతో ఈ నెల 25న జంగా కృష్ణమూర్తి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నామినేషన్ వేయనున్నారు.ఒకప్పుడు జగన్ ఆయనకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం పట్ల బీసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.సంఘ నాయకులు,కార్యకర్తలు జగన్ కు జైజైలు కొడుతున్నారు.