100 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ ఇకలేరు.గచ్చిబౌలిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.గురువారం ఉదయం ఆయన అనారోగ్యానికి గురైన ఆయన్ను కుటుంబ సభ్యులుహుటాహుటీన గచ్చిబౌలిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. పశ్చిమ గోదావరి పాలకొల్లు జన్మించిన కోడి రామకృష్ణ 100 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు.ఆయన తెలుగు,తమిళం, హిందీ ,కన్నడ,మలయాళ చిత్రాలకు కూడా దర్శకత్వం వహించారు.రామకృష్ణ ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో తన కెరీర్ మొదలవగా..కన్నడ చిత్రం ‘నాగహారవు’ తర్వాత మరో చిత్రానికి దర్శకత్వం వహించలేదు.
